Header Banner

Inflight Mistake: విమానంలో ఆ చిన్న పొరపాటుకు 83 కోట్లు.. ఆ ప్రయాణికుడికి!

  Wed Jun 18, 2025 16:21        Others

విమాన ప్రయాణంలో చిన్న చిన్న అపశృతులు, అసౌకర్యాలు ఎదురుకావడం సర్వసాధారణం. అయితే అలాంటి చిన్న పొరపాటు మీ ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపించి, మీ టూర్ మొత్తంపై ప్రభావం చూపిస్తే ఎలా ఉంటుంది. ఎంత కోపం వస్తుంది. న్యూయార్క్‌కు చెందిన వృద్ధ దంపతులకు తాజాగా ఇలాంటి అనుభవమే ఎదురైంది. దీంతో వారు సదరు ఎయిర్‌లైన్స్ సంస్థపై ఏకంగా 83 కోట్ల రూపాయలకు దావా వేశారు. దీంతో ఈ వార్త ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతోంది న్యూయార్‌కు చెందిన 78 ఏళ్ల ఐమారా కార్బో తన భర్త గియుసెప్‌తో కలిసి స్కాండినేవియన్ ఎయిర్‌లైన్స్ విమానంలో ప్రయాణిస్తోంది. విమానంలో ఉన్న ఎయిర్‌హోస్టెస్‌ను ఐమారా కాఫీ అడిగింది. ఎయిర్‌హోస్టెస్ వేడి వేడి కాఫీని తీసుకొచ్చింది. అయితే ఆ కప్పును అందించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఆ వేడి కాఫీ కాస్తా ఐమారాపై పడింది. కాఫీ చాలా వేడిగా ఉండటం వల్ల ఐమారా చర్మం తీవ్రంగా కాలిపోయింది. దీంతో వారు ఆ తర్వాత ఆ ట్రిప్ సమయంలో చాలా ఇబ్బందులు పడ్డారు. సెలవులను సరిగ్గా ఎంజాయ్ చేయలేకపోయారు. ఈ ఘటన తర్వాత ఐమారా భర్త స్కాండినేవియన్ ఎయిర్‌లైన్స్‌పై 10 మిలియన్ డాలర్లకు (రూ.83.45 కోట్లు) దావా వేశారు. హాట్ డ్రింక్స్ విషయంలో ఎయిర్‌లైన్ భద్రతా ప్రమాణాలను పాటించలేదని, వృద్ధ ప్రయాణీకుల భద్రతలో తీవ్ర నిర్లక్ష్యం చూపించిందని వారి తరఫు న్యాయవాది జోనాథన్ రీటర్ దావా వేశారు. ఐమారా వైద్య ఖర్చులు, మానసిక ఒత్తిడి, సెలవుల నష్టానికి పరిహారంగా సదరు ఎయిర్‌లైన్స్ సంస్థ 10 మిలియన్ డాలర్లు చెల్లించాలని డిమాండ్ చేశారు. స్కాండినేవియన్ ఎయిర్‌లైన్స్ ఈ విషయంలో ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ప్రకటనా చేయకపోవడం గమనార్హం.

 

ఇది కూడా చదవండి: Adabidda nidhi Scheme: ఏపీ మహిళలకు శుభవార్త.. నెలకు రూ. 1500పై కీలక అప్‌డేట్! ఈ పథకం త్వరలోనే!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు: 

Free bus: ఆడవాళ్ళకి అదిరిపోయే శుభవార్త... ఆగస్టు 15 నుంచి అమలు!

 

Pakistan: భారత్ పై యుద్ధం తప్ప మరో దారి లేదు.. పాకిస్థాన్ సంచలన వ్యాఖ్యలు!

 

Rythu Bharosa: రైతన్నలూ.. బ్యాంక్ ఖాతాలు చెక్ చేసుకోండి! పంట పండించే ప్రతి ఎకరాకు!

 

Chandrababu warning Jagan: పులివెందుల రాజకీయం చేస్తే.. తోక కట్ చేస్తా! ఎవరు తప్పు చేసినా..

 

అధికారులు అలర్ట్.. చంద్రబాబు హెలికాప్టర్‌లో సాంకేతిక సమస్యలు! విశాఖపట్నంలో సీఎం పర్యటన..

 

ఏసీబీ ఆఫీస్ వద్ద ఉద్రిక్తతలు! మాజీ మంత్రికి మద్దతుగా వచ్చిన కార్యకర్తలు అరెస్ట్!

 

ఆ జిల్లా టమాటా రైతులపై ఊజీ ఈగ పిడుగు! దీంతో కొనేవారే..

 

Begumpet Airport: తీవ్ర ఉద్రిక్తం.. బేగంపేట్ ఎయిర్ పోర్టుకు బాంబ్ బెదిరింపు! బాంబ్ స్వ్కాడ్ తనిఖీలు!

 

అసైన్డ్‌ భూములకు రెక్కలు.. ఈ డీల్‌తో రంగం.. ఆ జిల్లా కేంద్రంగా విశాఖ అధికారుల భేటీలు!

 

తల్లికి వందనం పడలేదా! పిల్లలు ఇప్పుడే ఫస్ట్ క్లాస్ కి వెళ్తున్నారా...అయితే ఇలా నమోదు చేసుకోండి!

 

ఆ రెండు దేశాలు చేస్తున్న హడావిడి చూస్తుంటే.. గోల్డ్ రేట్లు ఆకాశంలోకే! బంగారం రూ.లక్షలు..కారణం ఇదే!

 

ట్రంప్ ‘గోల్డ్ కార్డ్’ వెబ్‌సైట్‌: అమెరికా పౌరసత్వం కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలో చూద్దాం! అర్హతలివే!

 

సవాల్ చేస్తే సౌండ్ ఆఫ్! శరణమాన్యాయ సమరమా తేల్చుకోవాలని జగన్‌కు సూచన!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 


   #andhrapravasi #andhrapradesh #plane #mistake #small #passenger #83crores #punishment #flight